నన్ను ఎదుర్కోలేకనే మీడియాకు లీకులు..తప్పుడు వార్తలు

– మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట్రామరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తనను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ది పొందాలని చూస్తున్నారని మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట్రామరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయలేదనీ, డబ్బులు తరలించినట్టు కట్టుకథ అల్లి అల్లటం బట్టకాల్చి మీద వేయడమేనని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేతులు కలిపి నన్ను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయితీగా సేవలందించానని తెలిపారు. ప్రజలకు మరింత సేవలు అందించడానికి ప్రత్యక్ష రాజకీయం లోకి వచ్చానని పేర్కొన్నారు.

Spread the love