Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'సౌండ్‌ ఆఫ్‌ లవ్‌' సందడి షురూ..

‘సౌండ్‌ ఆఫ్‌ లవ్‌’ సందడి షురూ..

- Advertisement -

నరేష్‌ అగస్త్య హీరోగా దర్శకుడు విపిన్‌ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్‌ అయిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. చిత్రంలో రబియా ఖతూన్‌ కథానాయిక. ఫస్ట్‌ సింగిల్‌ ”సౌండ్‌ ఆఫ్‌ లవ్‌” విడుదలతో మేకర్స్‌ మ్యూజిక్‌ జర్నీ ప్రారంభించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ పాటని మనసుని కదిలించే సాంగ్‌గా కంపోజ్‌ చేశారు. అన్నీ సహజమైన శబ్దాలతో ఈ సాంగ్‌ని కంపోజ్‌ చేయడం విశేషం. గొప్ప ఆర్కెస్ట్రేషన్‌తో ఈ పాట క్లాసిక్‌ రొమాంటిక్‌ మ్యూజిక్‌ ఎసెన్స్‌ని అందించింది. ఈ పాటకు రెహ్మాన్‌ పొయిటిక్‌ సాహిత్యం ఆకట్టుకుంది. ఎస్పీబీ చరణ్‌, షాషా తిరుపతి వాయిస్‌లు మ్యాజికల్‌గా ఉన్నాయి. విజువల్‌గా పాట అద్భుతంగా ఉంది. నరేష్‌ అగస్త్య, రబియా ఖతూన్‌ కెమిస్ట్రీ హార్ట్‌ఫుల్‌గా ఉంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. మేకర్స్‌ ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
రాధిక శరత్‌కుమార్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్‌, ఆమని, తులసి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మాస్టర్‌ కార్తికేయ, మోహన్‌ రామన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – విపిన్‌, సినిమాటోగ్రాఫర్‌ – మోహన కష్ణ, సంగీతం – జస్టిన్‌ ప్రభాకరన్‌, ఆర్ట్‌ – తోట తరణి, ఎడిటర్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -