సీఆర్‌ ఎంపీ కాంట్రాక్ట్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలి

– తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జైపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ప్రధాన రహదారులపై పారిశుధ్య పనులు నిర్వహిం చకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీఆర్‌ ఎంపీ కాంటాక్ట్‌ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రన గర్‌ సర్కిల్‌ పరిధిలోని పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు సమస్యలు జైపాల్‌రెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పిల్లర్‌ నెంబర్‌ 117, నుండి అరంఘర్‌ చౌరస్తా, మైలార్‌దేవ్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు, దురాగనగర్‌ చౌరస్తా నుండి ఓల్డ్‌ కర్నూలు రోడ్డు గగన్‌పాడ్‌ వరకు సీఆర్‌ఎంపీ కాంట్రాక్ట్‌ సంస్థ పారిశుధ్యం పనులు నిర్వహించాలి కానీ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికుల చేతనే అధికారులు పనులు చేయిస్తు న్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు మాత్రం నేల నేల జీహెచ్‌ఎంసీ నుంచి లక్షల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంస్థ పనిచేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారని ఇందులో జీహెచ్‌ఎంసీ అధికారుల పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇకనైనా జీహెచ్‌ఎంసీి అధికారు లు ఆ సంస్థ పని తీరుపై దృష్టి పెట్టి ప్రధాన రహదారు లపై పారిశుధ్య పనులు చేసే విధంగా చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిచో త్వరలో జీహెచ్‌ ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Spread the love