అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు..?

– దోంగ దిక్షలతో మొసలి కన్నిళ్ళు..
– నష్టపోయిన వారిని అదుకుంటం..
– సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి లబ్ధి చేకుర్చ కుండా నల్ల చట్టాలను తీసుకుని వచ్చి వేలాదిమంది రైతుల ప్రాణాలు బలి తీసుకుందని, నేడు రైతులపై కపట ప్రేమ చుయిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని, ఒకసారి చట్టాలు చేసిన తర్వాత రైతుల ఆందోళన  నేపథ్యంలో నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవడం చరిత్రలోనే ఎప్పుడు జరగలేదని, అప్పటికే వీరాజ్ మంది రైతులు ప్రాణాలు బలి తీసుకున్నారని, అలాంటి వారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలం లోని దుస్ గం, ఇందల్ వాయి మండలం లోని ఇందల్ వాయి,ఇందల్ వాయి తండా, గండి తండా,సామ్య నాయక్ తండా,గన్నరం తోపాటు ఇతర గ్రామాల్లో కురిసిన ఆకల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను, నివాస గృహాలను, ధాన్యాం కోనుగోలు కేంద్రాలను,  విద్యుత్ లైన్లను తదితర వాటిని శనివారం సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నష్ట పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా కల్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 15 ఆగస్టు లోపల రెండు లక్షల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇదే కాకుండా మరి ధాన్యానికి క్వింటాళ్ కు రూ.500 రూపాయల బోనస్ కూడా వచ్చే పంట నుంచి అందజేస్తామని ఆయన అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట బీమా చేయకపోవడంతో నేడు ఈ పరిస్థితులు దపురించాయని, నేడు కరువు వచ్చిన దానికి కారణం బిఆర్ఎస్, బీజేపీ పార్టీ లే కారణమని ఆరోపించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, రైతన్నలు ఏలాంటి ఆందోళన, దిగులు చేందోద్దని, ఎళ్ళవేళల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జామ చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దళారులదే రాజ్యం నడిచిందన్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఒక సంచి వెంట పది నుంచి పదిహేను కిలోలు కటింగ్ చేస్తూ కింది నుంచి పై స్థాయి వరకు కమిషన్లు పొందారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఇలా చేస్తే అలాంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారని, దానిలో భాగంగానే ఈసారి ఒక కిలో వరి ధాన్యాన్ని కటింగ్ చేయకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని, కాని ఇప్పుడు 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తున్నమని వివరించారు. బీజేపీ, బిఅర్ఎస్ పదేళ్లు అదికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని, కళేశ్వరం పేరుతో లక్షల కోట్లు తమ జేబులో వేసుకున్నారని,మేడిగడ్డ కుంగి పోయిందని దినికి కారణం వారేనన్నారు. భారాస, భాజపా పార్టీలతో అభివృద్ధి సాధ్యపడదన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఇచ్చిన ప్రతి హామీలను అరునురైన అమలు చేస్తుందని వివరించారు.అకాల వర్షానికి నష్టపోయిన రైతులను, నివాస గృహాల బాదితులను ఆదుకుంటామని, గత నెలలో కురిసిన వర్షాలకు గాను నష్టపోయిన పంట వివరాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారని లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో ఎకరానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఎన్నికల అయిన వెంటనే అందజేయడం జరుగుతుందన్నారు. అకల వర్షల వల్ల  నివాస గృహాలు నష్టపోయారని ఎన్నికల అయిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలోనే మంజూరు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం పలువురికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ఎమ్మెల్యే డాక్టర్ రేకలపల్లి భూపతిరెడ్డి అందజేశారు.
ఇప్పటికే వ్యవసాయ శాఖ రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులతో నష్టపోయిన వివరాలను అందజేసే విధంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వివరించారు. బాధితులకు కొండంత భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వేంట మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్పు గంగారెడ్డి, ఇందల్ వాయి, డిచ్ పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ మారుతి, డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి, సుధాకర్, సిహెచ్ దాస్, మోహన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రాథోడ్, దర్మగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బైరయ్య, బద్దంరెడ్డి, దశరథ్, రతన్, సుధాకర్, మహిపాల్, సిఈఓ రతన్, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love