
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్విప్ కార్యక్రమంలో బాగంగా ఏర్పాటుచేసిన ఓటు ఆవశ్యకత జిల్లా స్థాయి డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలలో బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక తో కలసి పాల్గోంన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో 95 శాతం ఓటర్ టర్న్ అవుట్ ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని,వృద్ధులు,థర్డ్ జెండర్స్ పై ప్రత్యేక దృష్టి సారించి వారిని అవగాహనపరిచి 100 శాతం ఓటు నమోదుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్విప్ కార్యక్రమంలో బాగంగా ఓటర్ల ను అవగాహనపరిచేందుకు ఇప్పటి తరం పిల్లలు 15 సంవత్సరాల వయసు నుండే ఓటూ ప్రాధాన్యత , ఓటర్లను చైతన్యం చేసే బాధ్యతను తీసుకున్నారు అని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలోని స్నేహితులను బంధువులను తల్లిదండ్రులను తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తెలపాలన్నారు .తాత్కాలిక ప్రయోజనాలకు బహుమతులకు ప్రలోభాలకు ఆశించకుండా కులము ,మతము అనే ఆలోచనకు తావు లేకుండా ఓటు వినియోగించుకోవాలని వారు తెలిపారు.ఈనెల 23వ తేదీన నిర్వహించిన డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన మూడు విభాగాల నందు ప్రథమ ద్రుతీయ తృతీయ విజేతలకు నగదు పురస్కారాలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్విప్ నోడల్ ఆదికారి కే అశోక్, డి ఐ ఈ కృష్ణయ్య, విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.