విస్తృతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచార సందడి

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా రేపు పలు రాజకీయ పార్టీల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందడి విస్తృతంగా నిర్వహించనున్నారు. గురువారం మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు జరగబోయే కార్యక్రమాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి  కవిత వస్తున్నారని కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరుకావాలని ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ లాకావత్ నరసింహ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండలంలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులను తీరును పర్యవేక్షించనున్నారు. అంతేకాక మండల వ్యాప్తంగా విస్తృతంగా నాయకులు కార్యకర్తల కుటుంబాలు  పెళ్లిళ్లు కూడా ఉండడంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు ఎంపీ అభ్యర్థులు పార్టీల జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు భారీగా సందడి చేయనున్నారు ఈ మేరకు గ్రామాలు కూడాను రహదారి వెంట కావలసిన ఏర్పాట్లు చేశారు.
Spread the love