డబ్బులు తీసుకవేళ్ళేటప్పుడు సరిఅయిన పత్రాలు వెంట ఉండాలి: సీఐ

నవతెలంగాణ – తొగుట
డబ్బులు తీసుకవేళ్ళేటప్పుడు సరిఅయిన పత్రా లు వెంట ఉండాలని తొగుట సీఐ ఎస్క్ లతీఫ్  అన్నారు. గురువారం తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ లింగం, సిబ్బందితో కలిసి తుక్కాపూర్ గ్రామ శివా రులో సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహి స్తున్నామని తెలిపారు. బండారుపల్లి గ్రామానికి చెందిన సాయిబాబా తన హోండా యాక్టివ్ లో రూ. 80 వేలు తీసుకొని వెళ్తుండగా పట్టుకున్నా మని అన్నారు. ఈ డబ్బులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు.రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పు డు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచు కోవాలని సూచించారు. సీజ్ చేసిన డబ్బులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామని అన్నారు. ఆ డబ్బులకు సంబం ధించిన ఆధారాలు చూపించుకుని డబ్బులు తీసు కవేళ్ళాలన్నారు.
Spread the love