
– బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి తాళ్లూరి జీవన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేయాలని నియోజకవర్గ ఎన్నికల పార్టీ ఇంచార్జి తాళ్ళూరి జీవన్ సూచించారు.ఎన్నికల ప్రచారం కోసం మండలంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీతో పాటు ప్రతి 100 మంది ఓటర్లకు బూత్ స్థాయిలో మరో కమిటీని నియమించుకోవాలని,ఈ కమిటీ లే కీలకంగా పనిచేయాలని తెలిపారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంపై గురువారం పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సాద్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని,ఇచ్చిన హమీలను అమలు చేయకపోవటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతుందని వివరించారు.సుపరిపాలన మాజీ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు గ్రహిస్తున్నారు అని,దీనికి అనుగుణంగా ప్రజలను కలిసి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ పధకాలను వివరించి పార్టీ అభ్యర్థి ‘నామా’ వైపు ఆకర్షించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నిరుత్సాహం మనకు కలిసి వస్తుందని,ఎక్కువగా మహిళా ఓటర్లను కలిసే విధంగా కార్యచరణ చేపట్టాలని, కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువగా మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందారని ఉదాహరించారు. ఎన్నికల ప్రచారంలో అలసత్వం ఉండొద్దని,పోలింగ్ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ప్రజల్లోనే ఉండాలని చెప్పారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ‘నామా’కు భారీ మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా కోశాధికారి యూఎస్ ప్రకాశరావు,దమ్మపేట, గుంపెన సొసైటీ మాజీ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, బోయినపల్లి సుధాకర్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్,తాడేపల్లి రవి, మందపాటి రాజమోహన్ రెడ్డి, కాసాని చంద్ర మోహన్,వగ్గెల పూజ, మోరంపుడి అప్పారావు, దొడ్డు రమేష్, నియోజకవర్గ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.