– మాజీ ఎంపీ వి హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ కులగణన చేపడతామంటే ప్రధాని మోడీకి వణుకు మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు ప్రధాని అవుతారంటూ ఆయన మాట్లాడం సిగ్గుచేటన్నారు. ఆదివారం హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పదేండ్ల మోడీ పాలనలో అయోధ్యలో గుడికట్టడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.