– వ్యవసాయ శాఖ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాలం సీజన్‌కు కల్తీ విత్తనాల అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ, పోలీసు,విజిలెన్స్ శాఖలను అప్ర మత్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మన రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్నప్పటికి వారిపై తనిఖీలు చేపట్టాలని ఆదేశిం చింది. ముఖ్యంగా లైసెన్స్ లేకుండా నిషేదిత పత్తి, ఇతర విత్తనాలను రైతులకు మభ్యపెట్టి అమ్మే వారిపై గట్టి నిఘా పెట్టింది. ఇప్పటికే కల్తీ విత్తనా లను అమ్మిన 12 మంది గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. లైసెన్స్ లేకుండా విత్తనాలను అమ్మడం విత్తన నియంత్రణ చట్టం 1983 ప్రకారం నేరం అని పేర్కొంది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొవాలని సూచించింది. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలనీ, తీసుకున్న రశీదును పంట కోతలు పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించింది.