
అమెరికా దేశంలో చికాగో నగరంలో నీ అమరవీరుల పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సీపీఐ(ఎం) పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు సాగించిన పోరాటంలో అనేకమంది కార్మికులు రక్తం చిందించి మరణం పొందారని ఆ అమరవీరుల రక్తమే ఈనాడు ఎరుపెక్కిన ఎర్ర జెండాగా మారి నాటి నుండి నేటి వరకు మే ఒకటి న ప్రపంచ కార్మికులంతా మేడే పండుగను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.నాటి పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా 18 గంటల పని విధానం రద్దయి రోజుకు ఎనిమిది గంటలు పని సాధించటం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారం ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక చట్టాలనురద్దు చేస్తుందన్నారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజిస్తూ కార్మిక వ్యతిరేకవిధానాలకు పాల్పడిందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తంకార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తూ పేదలపై, రైతాంగంపై, కార్మిక వర్గంపై భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రజిత మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి మండల నాయకులు బొజ్జ శీను తొట్ల లింగయ్య అంజేపెల్లి లక్ష్మయ్య తొట్ల అచ్చయ్య సామ వెంకట్ రెడ్డి కూసు సైదులు శాఖా కార్యదర్శులు గజవెల్లి శ్రీనివాసరెడ్డి సామ సురేందర్ రెడ్డి నాగభూషణం వెంకట ముత్యం రవి శ్రీను ముండ్ల సంజీవ సాయి రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి మే డే సందర్భంగా సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి గాజుల జానయ్య గజెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.