కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం..

– కళ్యాణానికి హాజరైన శాసనసభ్యులు మందుల సామేల్
నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రం తో పాటు పరిధిలోని మిర్యాల లింగంపల్లి ,పెద్దనేమిలా వెంకేపెళ్లి గ్రామాలలో శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. రెండవ భద్రాద్రిగా పిలవబడే మిరియాల గ్రామంలో జరిగే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో, లింగంపల్లి లో మాజీ సర్పంచ్ ఓరుగంటి ఉషా రామకృష్ణారావు దంపతుల ఆధ్వర్యంలో, పెద్దనేమిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love