కాంగ్రెస్ లో చేరిన మద్దికుంట ఆలయ కమిటీ ఛైర్మన్

– తిరిగి సొంత గూటికి చేరిన ఛైర్మన్
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంట ఆలయ కమిటీ చైర్మన్ గోజారి లచ్చిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. తిరిగి శుక్రవారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్లో చేరారు. చేరిన వారిలో గోజారి భాస్కర్ రెడ్డి, దుంపల శ్రీకాంత్, స్కూల్ తాండకు చెందిన బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు సలావత్ తిరుపతి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సలవర్ చందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు గంగావత్ బోజు, ప్రధాన కార్యదర్శి సలావత్ శ్రీరామ్ తోపాటు పలువురు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రెడ్డి నాయక్, విట్టల్ నాయక్, బండి ప్రవీణ్, దుంపల బాలరాజు, గజ్జల బాలరాజు, బోజు నాయక్, చందర్ నాయక్ తదితరులు ఉన్నారు.
Spread the love