మండలంలోని రావిరాల గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి కృష్ణ టు అన్నారు శనివారం ఆ గ్రామంలో ఉపాధి హామీ పను వద్దకు వెళ్లి బలరాం నాయక్ గెలుపుకు కృషి చేయాలని శనివారం కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ కి భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు బలరాం నాయక్ గెలిస్తే మంత్రి పదవి వస్తుందని దీంతో మన గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికి ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామాన్ని అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తుల కృష్ణ కత్తుల ఏకాంతం రవి తో పాటు కార్యకర్తల పాల్గొన్నారు