– పాల ఉత్పత్తులు పెరిగేలా అవగాహన కల్పించాలి
– జిల్లా పశుసంవర్ధక శాఖాదికారి డా. కుమారస్వామి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వేసవి తీవ్రత నేపథ్యంలో పశువుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. కుమారస్వామి సూచించారు.సోమవారం కలెక్టరేట్ లో పశువుల సంరక్షణ పై మండల వైద్యాధికారుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని పశువులసంరక్షణకై అన్నిమండలాల్లో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులు ఎండలకుసైతం వెరవకుండా విజయవంతంగా గాలికుంటూ నివారణ టీకాలు పూర్తిచేనందులకు జిల్లా పశువైద్యాధికారులను అభినందించారు. వేసవిలో పశువులకు తాగునీటిసమస్యలేకుండా ప్రతీ గ్రామములో రెండు నీటి తొట్లు ఉండేలా గ్రామపంచాయితీల సహకారంతో ఏర్పాటు చేయాలని సూచించారు.పశువులని ఉదయం 6-00 నుండి పది గంటల లోపు అలాగే సాయంత్రం 4-00 గంటల తరువాతనే మేతకు బైటకు పంపించాలని అన్నారు. మధ్యాహ్నం వేళల్లో పశువులకు ఇంటివద్ద పచ్చిగడ్డి, చల్లటి నీరు అందుబాటులో ఉంచాలని లాగే పశుపోషకులకు పశువుల్లో వేసవి తాపం యాజమాన్యంపై అవగాహనకల్పించాలని సూచించారు.గ్రామాల్లో ఇండ్ల వద్ద , బిల్డింగ్ల పై పక్షుల తాగునీరు కై పాత్రల్లో మంచినీరు అందుబాటులో ఉంచేలా ప్రజల్లో ప్రచారం చెయ్యాలని సూచించారు. పశుసంక్షేమ పథకాల రూపకల్పనలో అతి ముఖ్యమైన వేసవికాల శాంపిల్ సర్వే. ప్రణాళికాబద్ధంగా నిత్వహించాలని తద్వారా పశుసంపద ఉత్పత్తులపై. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించేందుకు వీలుగా ఉంయుండని తెలిపారు. కార్యాలయాల్లో.రికార్డుల నిర్వహణపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమములో అసిస్టెంట్ డైరెక్టర్ డా. పై పెంటయ్య మాట్లాడుతూ రికార్డులు శాఖ , ఉద్యోగుల పనితీరు క్రమశిక్షణ అలాగే జవాబుదారీ తనానికి ప్రామాణికాలనీ, ప్రతీ రిజిస్టర్ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలంలో నిర్వహిస్తూ వాటి జీవితకాలాన్నిబట్టి భద్రపరచాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ బి వెంకన్న ప్రాంతీయ పశు వైద్యశాలల అసిస్టెంట్ డైరెక్టర్స్, సమస్త జిల్లా పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు.