Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయండి..

యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయండి..

- Advertisement -

బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు డి.రాజారామ్ యాదవ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ఈనెల 30న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ దగ్గర జరిగే యాదవుల “ఆత్మగౌరవ సభ”ను జయప్రదం చేయాలని ఓయూ జేఏసీ నేత, బిసి జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం భువనగిరి పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేష్ యాదవ్  ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  దేశంలో, రాష్ట్రంలో బీసీల్లోనే అత్యధిక జనాభా కలిగిన యాదవులకు మంత్రి పదవి, నామినేట్ పోస్టులు కేటాయించకపోవడం తీవ్ర అవమానకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో త్యాగం చేసిన యాదవులకు న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు.  రాజ్యాలను ఏలిన చరిత్ర, లాలు, ములాయం వారసత్వం కలిగిన యాదవులు పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇంత అన్యాయం జరుగుతుంటే యాదవులు మౌనంగా ఉండటం బానిసలతో సమానమని అన్నారు. 

మన న్యాయమైన వాటా కోసం ఈనెల 30న ఇందిరాపార్క్ దగ్గర జరిగే “యాదవుల ఆత్మగౌరవ సభ”ను పార్టీలు, సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని రాజారాం యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్,  తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ యాదవ్, గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేశబోయిన సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు సురేష్ యాదవ్,  యూత్ అధ్యక్షులు రేకల రమేష్ యాదవ్,పట్టణ అధ్యక్షులు మర్రి పాండు యాదవ్, కార్యదర్శి తెల్జురి శ్రీశైలం యాదవ్, నరాల రాజు యాదవ్, ఎంపీటీసీ ఉడత ఆంజనేయులు యాదవ్, సిద్ధులు యాదవ్, మండల యూత్ అధ్యక్షులు రాసాల లింగస్వామి యాదవ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్, తుమ్మేటి శ్రీశైలం యాదవ్, భూషబోయిన రామకృష్ణ యాదవ్, కడారి నరేష్ యాదవ్, మచ్చ రాజు యాదవ్,గొర్ల మల్లేష్ యాదవ్, గుండబోయిన నరసింహ యాదవ్, గొర్ల వెంకటేష్ యాదవ్, మెడబోయిన మల్లేష్ యాదవ్, నవీన్ యాదవ్,అవిశెట్టి మల్లేష్ యాదవ్, కొత్త జాంగిర్ యాదవ్, నరసింహ యాదవ్ ,యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -