
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన బండి సంపత్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా నియమాకమైయ్యారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ మండల నాయకులతో కలిసి బండి సంపత్ కు నియమాకపత్రమందజేశారు.తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా నియమించినటదుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలం పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,కాంగ్రెస్ శ్రేణులకు బండి సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,ఉప సర్పంచ్ బండి వేణు,టౌన్ ప్రెసిడెంట్ బండిపెల్లి రాజు,శెట్టి రాజు,పులి సంతోష్,జెల్లా ప్రభాకర్,బైర సంతోష్,సూరం తిరుపతి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.