
నవతెలంగాణ – డిచ్ పల్లి
శిక్షణా కార్యక్రమాలు చాలా మంచి నాణ్యతతో ఇస్తున్నామని, ఎంతో మంది ఇక్కడ శిక్షణా తీసుకొని జీవితంలో స్థిరపడ్డారని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ అన్నారు.గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని అర్ఎస్ఈటిఐ శిక్షణ కేంద్రం లో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధ్వర్యంలో మగ్గం వర్క్ శిక్షణా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. 30 రోజుల శిక్షణ లో బాగంగా అనునిత్యం మార్కేట్ లో డిమాండ్ కు అనుగుణంగా అందజేసిన శిక్షణా తరగతులు ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ చేతులమీదుగా శిక్షనర్తులకు దృవీకరణ పాత్రలు, టూల్ కిట్ లను అందజేశారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ అర్ఎస్ఈటిఐ లో శిక్షణా కార్యక్రమాలు చాలా మంచి నాణ్యతతో ఇస్తున్నామని ఎంతో మంది ఇక్కడ శిక్షణా తీసుకొని జీవితంలో స్థిరపడ్డారని వివరించారు.అర్ఎస్ఈటిఐ లో మగ్గం వర్క్ శిక్షణా చాలా మంచి డిమాండ్ ఉన్న శిక్షణా అని, ఈ మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్లకు భవిష్యత్ లో మంచి డబ్బు సంపాదించుకోవచ్చని, అందరూ ఈ శిక్షణా అంతరం వర్క్ వేయడం ద్వారా జీవితం లో స్థిరపడాలని సూచించారు. ఏదైనా నేర్చుకున్న శిక్షణా పైన షాప్ పెట్టుకోవాలనుకునే వారికి బ్యాంక్ ద్వారా ఋణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు అయన పేర్కొన్నారు.30 మంది ఈ బ్యాచ్ లో మగ్గం వర్క్ నేర్చుకున్నారని, మీ గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భాగ్య లక్ష్మి, రామకృష్ణ, ఫేకల్టి నవీన్, రంజీత్,ఫారిధ, లక్ష్మన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.