Thursday, June 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమోడీ ఓ అద్భుతం

మోడీ ఓ అద్భుతం

- Advertisement -

– బట్‌…ఐ లవ్‌ పాక్‌..ట్రంప్‌ డబుల్‌రోల్‌
”పాకిస్తాన్‌ అంటే నాకు ఇష్టం. మోడీ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో మాట్లాడాను. మేం భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్థాన్‌- భారత్‌ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ చాలా ప్రభావవంతమైన వ్యక్తి. పాకిస్తాన్‌ వైపు నుంచి మునీర్‌, భారత్‌ తరఫున మోడీ తదితరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారు. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను” అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. బుధవారంనాడాయన అమెరికాలో మీడియాతో మాట్లాడారు. భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోడీ ట్రంప్‌నకు ఫోన్‌చేసి చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ ట్రంప్‌ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా మోడీని డిమాండ్‌ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -