నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ “హోప్ ఫర్ స్పందన” ఆద్వర్యంలో సంస్థ 101 వ షాపు ని, డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామం లో ప్రమాద వశాత్తూ వెన్నెముకకు గాయమై ఏళ్ల తరబడి వీల్ చైర్ కే పరిమితమైన దివ్యాంగుడు సిహెచ్. జ్ఞానేశ్వర్ కి స్వయం ఉపాధి లో భాగంగా గ్రామంలో కిరాణా దుకాణం ని పెట్టించారు. దాదాపు రూ.లక్ష 1.50 వేల రూపాయల విలువతో కూడిన ఈ కిరాణా షాపు కి నార్త్ అమెరికా తెలుగు సంఘం (NATS) వారు ఆర్థిక సహకారం అందించారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 షాపులను పూర్తి చేసుకున్న హోప్ ఫర్ స్పందన నేడు తన 101 షాపు ని ప్రవాస భారతీయులు, నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంబించారు. సంస్థ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహం కోట పర్యవేక్షణలో, రెండు తెలుగు రాష్ట్రాల సంస్థ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి, సంస్థ సభ్యులు దయ్యాల మహేష్, గ్రామస్తుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా హోప్ ఫర్ స్పందన వారి సహకారంతో తెలుగు రాష్ట్రాలలో పలురకాల సేవలను నార్త్ అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు నిరుపేద దివ్యాంగ కుటుంబాలకు, మానసిక వికలాంగులకు అందిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి నిరుపేద దివ్యాంగులకు నాట్స్ ద్వారా సేవలు అందించే అవకాశం రావడం చాలా గొప్ప గా భావిస్తున్నాము అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన హోప్ ఫర్ స్పందన కి, నార్త్ అమెరికా తెలుగు సంఘం సంస్థ సభ్యులందరికీ జ్ఞానేశ్వర్, కుటుంబ సభ్యులు
కృతజ్ఞతలు తెలిపారు.