
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పరిహార అటవీ భూముల నోటిఫికేషన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపేందుకు జిల్లా అటవీ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని కలెక్టర్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పరిశ్రమలకు కేటాయించిన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు జిల్లాలోని నడిగూడెం చింతలపాలెం మండలాలలో కేటాయించిన భూములను నోటిఫికేషన్ కొరకు ప్రతిపాదనలను కలెక్టర్ సమీక్షి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉన్న అడవులను సంరక్షించాలని ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అటవీ ధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్ ఆర్డిఓ కోదాడ సూర్య సూర్య నారాయణ హుజూర్నగర్ శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ కోదాడ లక్ష్మీపతిరావు నడిగూడెం తాసిల్దార్ హేమమాలిని చింతలపాలెం తాసిల్దార్ సురేందర్ రెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.