Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని వినతి

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి శుక్రవారం మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కిష్టా గౌడ్ మాట్లాడుతూ వంట కార్మికులకు రావాల్సిన 9 నెలల గుడ్ల బిల్లులు, 4 నెలల  3వేల రూపాయల జీతం పెండింగ్‌లో ఉన్నయని దాదాపు కామారెడ్డి జిల్లాలోని 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు చేయించి మధ్యాహ్న భోజన వంట కార్మికులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -