ఘనంగా కామ్రేడ్ బూసి రామచంద్రారెడ్డి  15వ వర్ధంతి సభ

నవతెలంగాణ – అచ్చంపేట 
మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో బుధవారం కామ్రేడ్ బూసి రామచంద్రారెడ్డి 15వ వర్ధంతి సభను సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామచంద్రారెడ్డి చిత్రపటానికి సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, రామచంద్ర రెడ్డి కుమారుడు మణిపాల్ రెడ్డి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రామస్తులు పూలతో ఘనంగా నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ పాల్గొని మాట్లాడారు.  రామచంద్రారెడ్డి గొప్ప భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం పనిచేయడానికి సీపీఐ(ఎం) పార్టీని ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగిరేయడానికి ముందుకు వచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. రామచంద్రారెడ్డి బతికిన కాలంలో గ్రామంలో సంపత్తి భోజనాలు ఏర్పాటు చేసి , ఎక్కువ తక్కువలు లేకుండా అందరూ కలిసి భోజనం చేసే వాళ్ళు అని అన్నారు. రామచంద్రారెడ్డి నక్సలైట్లు వచ్చి బెదిరించిన భయపడని గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు అంతయ్య,  రహీం, సుధాకర్ రెడ్డి, కొట్టే పర్తాలు,  నిరంజన్,  వీళ్ళందర్నీ కూడా నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని అన్నారు. రామచంద్రారెడ్డి బ్రతికినంత కాలం పేదల కోసమే పని చేశారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఉదయం ఒక పార్టీలో ఉండి  సాయంత్రం మరో పార్టీకి మారుతున్నారు. కానీ రామచంద్రారెడ్డి తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎర్రజెండా వారసత్వాన్ని కొనసాగించినాడని గుర్తు చేశారు. గ్రామంలో భూమిలేని నిరుపేదలకు భూమిని పంచిన గొప్ప మనసు గల వ్యక్తి రామచంద్రారెడ్డి అని కొనియాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తినే తిండి పైన,  కట్టే బట్టల పైన ఆంక్షలు విధిస్తున్నారు. పేదల పైన అనేక భారాలు మోపుతూ.. ధరలను విపరీతంగా పెంచుతున్నారని అన్నారు. పెట్రోలు డీజిల్ ధరలు ఫలితంగా పెంచారని,  మనం తాగి పాలు , పెరుగు మీద కూడా జీఎస్టీ విధించారని అన్నారు.  రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి,  ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మల, సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య,  వెంకటయ్య,  బుల్లు చిన్నయ్య , హెమ్లా నాయక్,  గ్రామస్తులందరూ పాల్గొన్నారు.
Spread the love