– ఎరువుల దుకాణాల్లో ఏఓ తనిఖీలు..
– కాలం చెల్లిన ఎరువులు,మందులను చూసుకోవాలని సూచన
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని ఎరువుల దుకాణాల్లో కాలం చెల్లిన పురుగుల మందుల నిల్వలున్నాయని’కాలం చెల్లిన పురుగుల మందుల నిల్వలు’శీర్షీకతో మంగళవారం నవతెలంగాణ దినపత్రిక వార్తను ప్రచురించింది. వార్తకు స్పందించిన అధికారులు ఏఓ సంతోష్, ఏఎస్ఐ శంకర్ రావు కలిసి బుధవారం మండలంలోని ఎరువుల దుకాణాల్లో అనుమతుల దృవీకరణ పత్రాలు,బిల్లులు,నిల్వల వివరాలను తనిఖీలు చేశారు.కాలం చెల్లిన విత్తనాల,పురుగు మందుల నిల్వలను ప్రతి రోజు సరిచూసుకుంటూ వివరాలు నమోదు చేయాలని ఏఓ సంతోష్ నిర్వహాకూలను సూచించారు.ఏఈఓ సాయి శంకర్ పాల్గొన్నారు.