
– సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామం లో అసెంబ్లీ సాదారణ ఎన్నికల నోటిఫికేషన్ కు రెండు రోజుల ముందు అందజేసిన డబుల్ బెడ్ రూం లో ఎన్నో సమస్యలతో కోట్టుమిట్టడు తున్నమని వేంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డబుల్ బెడ్ రూం లాబ్దిదారులు డబుల్ బెడ్ రూం లవద్ద ఆందోళన నిర్వహించి అనంతరం మండల కేంద్రానికి చేరుకుని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంనంత్ రావు కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలల క్రితం కెటాయించిన డబుల్ బెడ్ రూం లలో కనీస సౌకర్యాలు లేకుండా తివ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని వివరించారు.కరెంటు సౌకర్యం లేక మొత్తం ఒకటే మిటర్ పై 47డబుల్ బెడ్ రూం లు ఉన్నాయని, అస్తవ్యస్తంగా డ్రైనేజి సిస్టం ఉండటంతో దుర్గందంతో అనారోగ్యంతో బాధపడు తున్నమని, ఈగల దోమలతో సాహసం చేయక తప్పడం లేదన్నారు. అన్ని విషయాలు వివరంగా విన్న ఎంపిడిఓ అనంత్ రావు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో డబుల్ బెడ్ రూం లాబ్దిదరులు తదితరులు పాల్గొన్నారు.