విత్తన, పురుగు మందు దుకాణాలలో తనిఖీలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో విత్తన, పురుగు మందులు అమ్మే దుకాణాలలో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు.రైతులు  విత్తనాలను  కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా  రసీదు ఇవ్వడంతో పాటు  రైతు వారీగా రిజిస్టర్ లో పేర్లు నమోదు చేయాలని దుకాణాల యజమానులకు తెలిపారు.దుకాణాలలో గడువు ముగిసిన విత్తనాలు అమ్మితే  చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటామని దుకాణాల యజమాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్,  కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love