రైతుల అవసరాల మేరకు విత్తనాలను అందజేస్తున్నాం: ఏడిఏ

నవతెలంగాణ – డిచ్ పల్లి
జిల్లా రైతుల అవసరామగు పచ్చి రొట్టె విత్తనాలు జిలుగ విత్తనలను అన్ని సహకార సొసైటీ లో రైతుల అవసరం మేరకు సరఫరా చేయడం జరుగుతుందని రావో రోజుల్లో ఇంకా అవసరమున్న మేరకు జిలుగ విత్తనములను సహకార సొసైటీలకు సరఫరా చేయడం జరుగుతుందని, ఇంకా అవసరమైన చిలుక విత్తనాలు అన్ని సహకార సొసైటీలకు సరఫరా చేస్తామని పచ్చి రొట్టె జిలుగ విత్తనములు అవసరం మేరకు అందజేస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఏ డి ఏ అనిత, నిజామాబాద్ రూరల్ ఏడిఏ ప్రదీప్ అన్నారు. డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ సహకార సొసైటీ లో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సహకార సొసైటీలు ప్రైవేట్ డీలర్ల వద్ద విత్తన మధు కొనుగోలు చేసిన తర్వాత విధిగా దానికి సంబంధించిన రసీదును తీసుకోవాలన్నారు నాణ్యమైన ప్యాక్ చేసిన విత్తనములనే కొనుగోలు చేయాలని వారు సూచించారు. ఎరువులు అవసరాల మేరకు వాడాలని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొంది ఆర్థికంగా లాభపడాలని వారు సూచించారు.బర్దిపూర్ సొసైటీ లో 416 బస్తాల జీలుగ విత్తనములు రైతులకు అందించడం జరిగిందని, ఎటువంటి జిలుగ విత్తనాల కోరత లేకుండా అవసరమైన రైతులకు సరఫరా చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు సహకార సొసైటీ చైర్మన్ కోసరాజు రామకృష్ణ, ఏ ఈ ఓ లు ఆశ్రిత, వంశీకృష్ణ, రూపేష్ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love