– రాహుల్ 107, ప్రియాంక 108 ర్యాలీలు, రోడ్ షోలు
– జాన్ 4 ఫలితాల కోసం ఎదురుచూపులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గత ఎన్నికలకు భిన్నంగా హస్తానికి ఊపు కనిపించింది. ప్రధాని మోడీ, క్యాబినేట్ మంత్రులు, బీజేపీ బృం దాలు సహా అందరూ కదిలినా కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిం చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు 107, 108 ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహిం చారు. ప్రచారం చివరి రోజున రాహుల్ గాంధీ పంజాబ్‌లో ప్రచారం చేయగా, ప్రియాంక హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో రోడ్‌షో నిర్వహిం చారు. ప్రచారం ముగిసే నాటికి రాహుల్ 10 ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రియాంక 108 పబ్లిక్ మీటింగ్‌లు, రోడ్‌షోలలో ఉత్సాహభరిత ప్రచారం చేశారు. వందకు పైగా మీడియా బైట్‌లు, ఒక టీవీ ఇంటర్వ్యూ, ఐదు పేపర్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆమె 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆమె రెండు వారాల పాటు అమేథీలోనే ఉంటూ, రారుబరేలిలో ప్రచారం కొనసాగిం చారు. రాహుల్ గాంధీ రారుబరేలి నుంచి పోటీ చేస్తుండగా, గాంధీ ఫ్యామిలీకి సన్నిహితుడైన కె.ఎల్.శర్మ అమేథీ నుంచి బరిలో ఉన్నారు. ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ నాయకుడు తేజస్వి యాదవ్‌లతో కలిసి రాహుల్ గాంధీ కొన్ని బహిరంగ సభల్లో ప్రసంగించారు.ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న జూన్ 4న మాత్రమే వారు నిర్వహించిన ప్రచారాలు ఎంత మేరకు ఉపయోగపడ్డాయో తేలనుంది.