
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో రావి నారాయణరెడ్డి 117 వ జన్మదినాలు పుష్కరించుకొని మంగళవారం కంస్య విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జులై నెల చివరి వరకల్లా పూర్తయి, నెలాఖరున నిలువెత్తు కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వుంటుందనారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, స్థానిక శాసన సబ్యులు, పార్లమెంట్ సబ్యులు, యమ్మెల్సీ విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాసు, కార్యదర్శి రావి సుఖేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పడాల భాస్కర్ రావు, సంయుక్త కార్యదర్శి రావి హేమంత్ రెడ్డి, కోశాధికారి తిరుమణిదాసు వేంకటేశ్వర్లు, ముఖ్య సలహాదారు భువనగిరి సత్యనారాయణ, సలహా దారు రావి ప్రభాకర్ రెడ్డి, కార్యనిర్వాహక సబ్యులు గడ్డం విజయ భార్గవ్, కత్రోజు విజయ కుమార్, సీలోజు రాజలింగం, సీలోజు లక్ష్మణచారి, మాజీ సర్పంచ్ మద్ది బాల్ రెడ్డి, యంపిటిసి గడ్డమీది వీరయ్య, మాజీ జడ్పీటిసి సందెల సుధాకర్, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.