వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో వల్లాపురంలో, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థ, బ్రాంచ్‌ చైర్మెన్‌ డాక్టర్‌ వెలిగేటి చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఉచిత సంచార వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన వికలాంగులకు వైద్యాధికారులు హరినాథ్‌ బాబు, నరసింహారావు, నర్సు సింధుప్రియ వైద్య బృందం వారు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామ ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు మొక్కలు పంపిణీతోపాటు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్యదర్శి గుదిమళ్ళ సూర్యప్రకాశరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సాధినేని జనార్ధనరావు, కోశాధికారి గోవర్ధన్‌ రావు, ఉపేందర్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ యన్‌ శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, నరసయ్య , శ్రీహరి, నాగేశ్వరరావు, టి రాఘవయ్య, జి నాగేశ్వరరావు, జి మోహన్‌ రావు, పుల్లారావు, రెడ్‌ క్రాస్‌ యూత్‌ వాలంటీర్లు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love