యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జీనియస్ హైస్కూల్లో టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారము జిల్లా నూతన వర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా సంఘం అధ్యక్షులుగా కొండా సైదులు, ప్రధాన కార్యదర్శిగా కొండ్రెడ్డి శ్రీకాంత్, కోశాధికారిగా ఓరుగంటి రవికుమార్, ఉపాధ్యక్షులుగా పెండ్యాల వెంకటేష్, జాయింట్ సెక్రటరీగా మంగా ప్రవీణ్, కాసాని శివ సాయి కృష్ణ ఎగ్జిక్యూటివ్ నెంబర్లుగా రెడ్డి వినోద్ కుమార్, కుమారస్వామి, బింగి వంశీనాథ్, అథ్లెటిక్ మెంబర్ గా చెరక బాబు ఎన్నికయ్యారు ఈ యొక్క ఎన్నికల అధికారులుగా తెలంగాణ స్టేట్ టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ దాసరి సుధీర్, రిటర్నింగ్ అధికారిగా కిషన్ కేశరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్లేయర్స్ పబ్బతి ప్రశాంత్, సురిగి భరత్ కుమార్, సిహెచ్ భావేష్, కొమిర శ్రీ సింహా చరణ్, బి వి కే సుహాస్ పాల్గొన్నారు.