సబ్జెక్టు పట్ల అనాసక్తి

సబ్జెక్టు పట్ల అనాసక్తిస్కూల్లో పిల్లల ఆసక్తి, ఏకాగ్రతా, నేర్పుస్థాయి, గ్రహణశక్తి ఒకేలా వుండవు. కొందరికి సైన్స్‌ అంటే ఇష్టం. కొందరికి అయిష్టం. కొందరికి లాంగ్వేజెస్‌ అంటేనే ఇష్టం. కానీ చిత్రమేమంటే స్కూలు విద్యార్థులలో తొంభై శాతం మందికి గణితమంటేనే అనాసక్తి, భయం! ఆ టీచర్‌ అంటేనే భయం!
అసలు ఒక సబ్జెక్టు పట్ల ఆసక్తి ఉండడం, ఉండకపోవడం అనేది బాల్యంలోనే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు తెలివిగలవారు కావచ్చు. పిల్లలకి లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేకపోవచ్చు. గణితం, సైన్స్‌లలో ఆసక్తి వున్నవారు అన్నింటా రాణిస్తారన్న భావన చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉన్న నమ్మకం. దాన్నే ఎక్కువ చెబుతూ ప్రచారం చేస్తుంటారు. అందుకు పిల్లల్ని ఎలా వాటికి దగ్గర చేయాలన్నది మాత్రం సరిగ్గా చేపట్టరు. ‘మావాడు మాథ్స్‌ చాలా పూర్‌’, ‘మా పాప మాథ్స్‌ అంటే భయపడుతోంది’ అనే మాటలు నిత్యం వింటూవుంటాం. పిల్లలు ఎంత బాగా, చక్కగా బోధిస్తున్నా తలకెక్కించుకోవడం లేదు. మీరే ప్రత్యేక దృష్టిపెట్టి చెప్పండి..’ అంటూ పేరెంట్‌-టీచర్‌ సమావేశాల్లో తల్లిదండ్రులు అంటూవుంటారు. ఇది చాలా సహజం. ఏదైనా సబ్జెక్ట్‌ సరిగా రాదని గ్రహించగానే తల్లిదండ్రులు చేసే మొదటి పని ట్యూషన్‌ పెట్టించడం. ట్యూషన్లో చేరిస్తే ఆ సబ్జెక్టు సమస్య తీరిపోతుందన్నది వారి నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న నమ్మకం. దాన్ని పాటించడం తప్ప చాలామంది తల్లిదండ్రులు దాన్ని చిన్న సమస్యగా, తాము కాస్తంత శ్రద్ధచూపితే, సమయం తీసుకుంటే పరిష్కరించవచ్చునన్న ఆలోచనకు తావీయడం లేదు.
అసలు సమస్యను పరిశీలించాలి. ఉదాహరణకు మీ పిల్లలు లెక్కల్లో వీక్‌ అనుకుందాం. క్లాసులో చెబుతున్న లెక్కల్ని ఇంటి దగ్గర చేయించండి. పొరపాటు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. లెక్కలో సూత్రం అర్ధమయిందీ లేనిదీ గ్రహించండి. లేకుంటే వివరించండి. తర్వాత అటువంటివే కొన్ని దగ్గర ఉండి చేయించి భయాన్ని తొలగించండి. ఇలా వీలయితే ప్రతిరోజూ కొంత సమయం కేటాయించితే చాలు!
పిల్లలకు ఫలానా సబ్జెక్టు రాదని తెలసినపుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి. ఎవరితోనూ పోల్చవద్దు. చేయగలవు అన్న మాటే అంటూవుండండి. మాట్లాడుతూనే పిల్లలకు ఆ సబ్జెక్టు బోధించండి. తర్వాతది స్కూలు, తరగతిగదిలో పిల్లలకు సులభమవుతుంది. అంటే మీలోనూ ఒక టీచర్‌ వున్నాడన్నది గ్రహించండి. తల్లిదండ్రులే తొలి గురువులు అనేది అందుకే.
సబ్జెక్టు పట్ల అనాసక్తి
స్కూల్లో పిల్లల ఆసక్తి, ఏకాగ్రతా, నేర్పుస్థాయి, గ్రహణశక్తి ఒకేలా వుండవు. కొందరికి సైన్స్‌ అంటే ఇష్టం. కొందరికి అయిష్టం. కొందరికి లాంగ్వేజెస్‌ అంటేనే ఇష్టం. కానీ చిత్రమేమంటే స్కూలు విద్యార్థులలో తొంభై శాతం మందికి గణితమంటేనే అనాసక్తి, భయం! ఆ టీచర్‌ అంటేనే భయం!
అసలు ఒక సబ్జెక్టు పట్ల ఆసక్తి ఉండడం, ఉండకపోవడం అనేది బాల్యంలోనే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు తెలివిగలవారు కావచ్చు. పిల్లలకి లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేకపోవచ్చు. గణితం, సైన్స్‌లలో ఆసక్తి వున్నవారు అన్నింటా రాణిస్తారన్న భావన చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉన్న నమ్మకం. దాన్నే ఎక్కువ చెబుతూ ప్రచారం చేస్తుంటారు. అందుకు పిల్లల్ని ఎలా వాటికి దగ్గర చేయాలన్నది మాత్రం సరిగ్గా చేపట్టరు. ‘మావాడు మాథ్స్‌ చాలా పూర్‌’, ‘మా పాప మాథ్స్‌ అంటే భయపడుతోంది’ అనే మాటలు నిత్యం వింటూవుంటాం. పిల్లలు ఎంత బాగా, చక్కగా బోధిస్తున్నా తలకెక్కించుకోవడం లేదు. మీరే ప్రత్యేక దృష్టిపెట్టి చెప్పండి..’ అంటూ పేరెంట్‌-టీచర్‌ సమావేశాల్లో తల్లిదండ్రులు అంటూవుంటారు. ఇది చాలా సహజం. ఏదైనా సబ్జెక్ట్‌ సరిగా రాదని గ్రహించగానే తల్లిదండ్రులు చేసే మొదటి పని ట్యూషన్‌ పెట్టించడం. ట్యూషన్లో చేరిస్తే ఆ సబ్జెక్టు సమస్య తీరిపోతుందన్నది వారి నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న నమ్మకం. దాన్ని పాటించడం తప్ప చాలామంది తల్లిదండ్రులు దాన్ని చిన్న సమస్యగా, తాము కాస్తంత శ్రద్ధచూపితే, సమయం తీసుకుంటే పరిష్కరించవచ్చునన్న ఆలోచనకు తావీయడం లేదు.
అసలు సమస్యను పరిశీలించాలి. ఉదాహరణకు మీ పిల్లలు లెక్కల్లో వీక్‌ అనుకుందాం. క్లాసులో చెబుతున్న లెక్కల్ని ఇంటి దగ్గర చేయించండి. పొరపాటు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. లెక్కలో సూత్రం అర్ధమయిందీ లేనిదీ గ్రహించండి. లేకుంటే వివరించండి. తర్వాత అటువంటివే కొన్ని దగ్గర ఉండి చేయించి భయాన్ని తొలగించండి. ఇలా వీలయితే ప్రతిరోజూ కొంత సమయం కేటాయించితే చాలు!
పిల్లలకు ఫలానా సబ్జెక్టు రాదని తెలసినపుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి. ఎవరితోనూ పోల్చవద్దు. చేయగలవు అన్న మాటే అంటూవుండండి. మాట్లాడుతూనే పిల్లలకు ఆ సబ్జెక్టు బోధించండి. తర్వాతది స్కూలు, తరగతిగదిలో పిల్లలకు సులభమవుతుంది. అంటే మీలోనూ ఒక టీచర్‌ వున్నాడన్నది గ్రహించండి. తల్లిదండ్రులే తొలి గురువులు అనేది అందుకే.
ఇలా చేయండి…
– సబ్జెక్టు సంబంధిత టీచర్‌తో మాట్లాడండి. సమస్య తెలుస్తుంది.
– ఇంటి దగ్గర మీరూ కొంత సమయం చెప్పండి.
– సహనంతో, స్నేహభావంతో వ్యవహరించండి. టీచర్‌ లా కాదు.
– సబ్జెక్టు పట్ల ఆసక్తి, ఇష్టం కలిగేలా ప్రోత్సహించండి.
– భయం సబ్జెక్టును నేర్చుకోనివ్వదన్న సూత్రాన్ని తెలియజేయండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

Spread the love