న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం దారుణం..

Attacks on lawyers and illegal cases are outrageous..– బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం..
నవతెలంగాణ – వేములవాడ 
దేశంలో దేవాలయాలుగా పిలిచే న్యాయస్థానంలో విధి నిర్వహణలో పాల్గొనే  న్యాయవాదులపై పోలీసులు  దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టడం దారుణమని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. బుధవారం  సిరిసిల్లలో న్యాయవాదిపై అక్రమ కేసు, జనగామలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు  ప్రధాన ద్వారం ముందు న్యాయవాదుల అక్రమ కేసులపై, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే న్యాయవాదులపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో సీనియర్ న్యాయవాది సురభి సత్యనారాయణ పై అక్రమ కేసు పెట్టడం, వేములవాడలో సీనియర్ న్యాయవాది తిరుమల గౌడ్ పై అక్రమ కేసు పెట్టడం, మిగతా న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వెళ్లిన సందర్భంలో వారిని నిర్బంధించి, బెదిరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. కోర్టులో కేసు వేసి నిరంతరం శ్రమించి కేసు గెలిచే వరకు పోరాడే వ్యక్తి న్యాయవాదని అలాంటి న్యాయవాదులపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు గురి చేయడం పట్ల బార్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై అక్రమ కేసులు దాడులను గుర్తించి, న్యాయవాద రక్షణ చట్టాన్ని కఠినంగా రూపొందించాలని ఆయన  ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల  తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పిట్టల మనోహర్, కిషోర్ రావు, అంజయ్య, గడ్డం సత్యనారాయణరెడ్డి, కేశన్నగారి గోపికృష్ణ, పురుషోత్తం, పిల్లి మధు, పరశురాం, నాగుల సంపత్, పుప్పాల బాను, జెట్టి శేఖర్, పారువేల్ల శ్రీనివాస్, పంపరి శంకరయ్య, గుజ్జే మనోహర్, నరాల శ్రీనివాస్, భీమా మహేష్ బాబు, గడ్డం హన్మాండ్లు , కనికరపు శ్రీనివాస్, సాగరం శ్రీధర్ మహిళ న్యాయవాదులు సుజాత ,అన్నపూర్ణ, తో పాటు తదితరులు ఉన్నారు.
Spread the love