Friday, July 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల్లో కోనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 

గ్రామాల్లో కోనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 

- Advertisement -

పల్లెబాటలో ఎంపీడీఓ, హౌసింగ్ అధికారులు..
నవతెలంగాణ – ముధోల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పధకం కింద ఇండ్ల నిర్మాణం ముధోల్ మండలంలోని చురుకుగా కోనసాగుతున్నాయి. మండలానికి 489 ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇళ్లను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు ఇవ్వడంతో ఎంపీడీఓ, హౌసింగ్ అధికారులు, పల్లెబాట పట్టారు. ప్రతిరోజు ఇండ్ల పురోగతిపై కలెక్టర్ అడిగి తెలుసుకోవడమే కాకుండా, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది.

దీంతో ఎంపిడిఓ ,  పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు ఉరుకులు,పరుగులు పెడుతున్నారు.  ఇందిరమ్మ పధకం కింద ఎంపికైన లబ్ధిదారులను ఎంపిడిఓ, హౌసింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీల సహకారం తో లబ్ధిదారులను కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ఇందిరమ్మ పథకం నిబంధనలను తెలియజేస్తున్నారు.ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తుంది.  విడుదల వారిగా  బిల్లుల వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. బేస్మెంట్ పూర్తి అయిన వెంటనే లక్ష రూపాయలు, గోడల నిర్మాణం తర్వాత లక్ష, స్లాబ్ తర్వాత రెండు లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత లక్ష రూపాయల, డబ్బు లు లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

దీంతో లబ్దిదారులు  ఇండ్ల నిర్మాణంకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మండలంలో ఇండ్లు 241 ఇండ్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. అధికారులతో పాటు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా, లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ విషయం పై ఎంపీడీఓ శివ కుమార్ గురువారం నవతెలంగాణతో మాట్లాడారు. ఇప్పటికే యాబై  శాతం ఇండ్ల పనులు కొనసాగుతున్నాయి. మీగితా ఇండ్ల నిర్మాణం పనులను లబ్దిదారులు కట్టుకునే విధంగా చర్యలు చేపడుతున్నమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -