డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బీ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సర్వ రాజు ను నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. గత కొంతకాలంగా గాల్‌బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న అతనికి ఇటివలే సర్జరీ చేయించుకున్నారు.అ విషయం తెలుసుకుని ఆదివారం ధర్మారంలో ని స్వగృహంలో పరామర్శించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల నారాయణ భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో అయినను పరామర్శించారు. ఎళ్ళవెళల అండగా ఉంటామని అయా కుటుంబాలకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సినీయర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శక్కరి కొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు,నీరడి పద్మారావు, శంకర్, మాజీ సర్పంచ్ లింగం యాదవ్, ఆనంద్, సూదాం,మండల మహిళా అధ్యక్షురాలు గీత, కిషోర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.