యువతరం శివమెత్తితే

నవతెలంగాణ-ఆర్మూర్
యువతరం శిరమెత్తితే దోపిడీ వర్గాలకు నిద్ర పట్టదని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అన్నారు. పి వై ఎల్ ఏరియా 8వ మహాసభ ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగరంలోఎస్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన అన్నారు .స్వదేశీ పేరుతో మోడీ ఇంటికో ఉద్యోగం అంటూ కేసిఆర్ యువతను మోసం చేశారని ఆయన అన్నారు. మోడీ కేసీఆర్ లు అప్పులు కుప్పలుగా చేసి, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని ఆయన అన్నారు. యువశక్తిని మద్యం మత్తులో, బూతు, అశ్లీల సాహిత్యంతో బంధిస్తున్నారని వారు అన్నారు. ఉద్యమిస్తే నిర్బంధిస్తున్నారని, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలు నీళ్ల మూటలుగా మారాయని, వారు అన్నారు. పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్.రవి, అరుణోదయ జిల్లా అధ్యక్షులు వి.సూరిబాబు పాల్గొని మాట్లాడుతూ యువశక్తి పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో మూడో వంతు యువతీ, యువకులు ఉన్నారని పాలకుల కుట్రల్లి పసిగట్టి ఉద్యమిస్తే భారతదేశంలో మౌలిక మార్పు సంభవిస్తుందని వారు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కై నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన నేల ఇదని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని తరిమి కొట్టిన చైతన్య గడ్డయిదని ఆయన వివరించారు. మోడీ, కేసీఆర్.లు ఉపాధి కల్పించకుండా, ఉత్పత్తిలో యువతని భాగస్వామ్యం చేయకుండా నిరుద్యోగాన్ని, ఆకలి, అసమానతల్ని, పెంచుతున్నారని వారు అన్నారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. “దేశమంటే మట్టి కాదోయ్ — దేశమంటే మనుషులోయ్” అనే విషయాన్ని పాలకులు విస్మరించారని వారు అన్నారు. కుల,మతాల విద్వేషాలను మోడీ, సర్కార్ రెచ్చగొట్టి, లౌకిక విలువలను పాతరేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు అన్నారు. శ్రమ దోపిడీ లేని సమరాజ్యం పి వై ఎల్ పోరాడుతుందని వారు తెలిపారు. పిడిఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు బి. ప్రిన్స్, నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని ఆయన అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేకత నిజమైన దేశభక్తి అని ఆయన అన్నారు. అమరవీరులకు జోహార్లను అర్పించారు.

Spread the love