గడప గడపకు కేంద్ర సంక్షేమ పథకాల ప్రచారం

నవతెలంగాణ-గంగాధర : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు, ఇంటింటా ప్రచారం చేసే కార్యక్రమానికి గంగాధర మండలంలో బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజలకు వివరిస్తూ గడప గడపకు వెళ్లి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మండలంలోని మధురానగర్ గ్రామంలో గడప గడపకు కేంద్రం అమలు చేసే పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, నాయకులు తూము నారాయణ, రాజేంద్ర ప్రసాద్, పెరుక మహేష్, కముటం శ్రీనివాస్, తూము కరుణాకర్, వంశీ, వినయ్, చందు పాల్గొన్నారు.

Spread the love