- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని కెంటుకీ రాష్ట్రం లెక్సింగ్టన్ పట్టణంలోని రిచ్మండ్ రోడ్ బాప్టిస్ట్ చర్చ్‌లో కాల్పులు జరిగాయి. దుండగుడు చర్చ్‌లో ఇద్దరు మహిళలను కాల్చి చంపగా, ఇద్దరు పురుషులు గాయపడ్డారు. అనంతరం ఘటనాస్థలానికి కొద్దిదూరంలో బ్లూ గ్రాస్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ ట్రాఫిక్ స్టాప్‌లో పోలీసులపై కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని ఎదురుదాడిలో హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -