- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీసీల మహా ధర్నాకు గాంధారి మండల కేంద్రం, మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల మాజీ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ముస్తఫా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ తరలిన వారిలో మండల మాజీ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ముస్తఫా, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజులు, నాయకులు వేల్పుల నర్సింలు, మల్లేష్, సాయిలు, శ్రీనివాస్, సాయిలు యాదవ్, సాయిబాబా, సంతోష్, గౌస్, ప్రవీణ్, స్వామి తదితరులు ఉన్నారు.
- Advertisement -