- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నంబర్ 49తో ఆదివాసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆదివాసీ సంఘం మంచిర్యాల జిల్లా నాయకులు నాగేశ్వర్, యశ్వంత్, రాయి సెండం కాళీ అన్నారు. ఉమ్మడి జిల్లా బంద్లో భాగంగా సోమవారం జన్నారంలో దుకాణాలను మూసేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా జీవో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాకు నష్టం చేకూర్చే జీవోను రద్దు చేసే వరకు పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రం రాజేశ్వర్ బజ్జు దువ్వ యశ్వంతరావు, జ్ఞానేశ్వర్ గంగు, తుమ్మరం లక్ష్మణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -