
మండలంలో ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ధిరాములు మస్కట్లో మృతి చెందగా గురువారం గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు వారి కుటుంబానికి ఉప్పల్వాయిలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మస్కట్ ఇండియన్ ఎంబసీ హైమద్, సిద్ధిరాములకు సంబంధించిన వస్తువులను అందజేసి, రూ పదివేల, నిర్మల్ కు సంబంధించిన రాజేష్ రూ 5000, మండల గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి రూ 2000 అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షే ఇది కేటాయిస్తానని చెప్పి, ఇప్పటివరకు కేటాయించకపోవడం బాధాకరమని, వెంటనే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని, నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, గల్ఫ్ బాధిత కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకులు హైమద్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.