- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంట లో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. వారికి ఆలయ కమిటీ శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -