- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వాలా యాదగిరి రావు అనారోగ్యంతో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పడుతున్నాడు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి వైద్యులను తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంటా బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
- Advertisement -