Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు బాధిత కుటుంబాలకు పరామర్శ

పలు బాధిత కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వసంతరావు కు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన నల్ల రాజు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ ద్వారా ఒక కాలు ను తొలగించారు. విషయం తెలుసుకున్న సునీల్ కుమార్ ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -