- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ఆదివారం హైదరాబాదులో జరిగిన పెండ్లి శుభ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల నాయకులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, నాగేష్ పటేల్, కొండ గంగాధర్, వట్నాల రమేష్ ,యువ నాయకులు కుమ్మరి సచిన్, అమూల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -