- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజారచయితల వేదిక (ప్రరవే) అధ్యక్షురాలు అనిశెట్టి రజిత గుండెపోటుతో మరణించారు. వరంగల్‌లో ఉన్న ఆమె సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉందని చెప్పారు. ఆ విషయం తెలిసి మిత్రులు ఆమె దగ్గరకు వెళ్లేసరికి అపస్మారకస్థితిలో కనిపించారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని కాత్యాయనీ విద్మహే నివాసానికి తరలించారు. మంగళవారం ఆమె భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.
- Advertisement -