అన్ని వర్గాలనూ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
రేపు సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు : బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులసమావేశంలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజా కంటకంగా మారా యని విమర్శించారు. సీఎం చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని వివరించారు. చివరికి యువత, నిరుద్యోగుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం “యూత్ డిక్లరేషన్” పేరిట భారీ మోసం చేసిందన్నారు. వరంగల్ రైతు సభ అనంతరం, శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు.
సభకు అడ్డంకులు సృష్టించే అవకాశం
యువజన సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందనీ, అలాంటి ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌తోపాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్‌కు వివరించారు. యువజన సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



