- Advertisement -
నవతెలంగాణ – మంథని
న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సిబిఐ కి అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని మంథని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది శశిభూషణ్ కాచే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యాయ వాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నమని, సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. కుట్ర దారులను బయటకు తీసి న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగి, బాదిత కుటుంబాల సంఖ్యని న్యాయం జరుగుతందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -