Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి

క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి

- Advertisement -

రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ 
నవతెలంగాణ-మర్రిగూడ 
వర్షాలు పడకుండా,రాష్ట్రంలో కరువు రావాలంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నీటి ఎద్దడితో రైతాంగం సతమతమవుతుంటే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరైనది కాదని మండిపడ్డారు.రైతు మేలును కోరి అహర్నిశములు శ్రమించి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన హరీష్ రావు పై అలాంటి ఆరోపణలను చేయడం సిగ్గుచేటు అని అన్నారు.

ఆధునిక ప్రపంచంలో క్షుద్ర పూజలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు వారి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.నీటి సమస్యలు తీర్చలేక,ఇచ్చిన హామీలను అమలు చేయలేక,కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పు త్రోవ పట్టించడానికి డైవర్షన్ రాజకీయాలకు పూనుకున్నారన్నారు.ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్తారన్నారు.బిఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి వారిపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యనిర్వాహణ కార్యదర్శి కొలుకులపల్లి యాదయ్య,గ్రామ శాఖ రాపోలు యాదగిరి,యువజన నాయకులు బూరుగు నాగరాజు,వంగూరి గిరిబాబు,వార్డు సభ్యులు కొండాపురం నరేష్,యండి గౌస్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -