- Advertisement -
నవతెలంగాణ- కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో రైతులకు యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఉదయం 4 గంటలకు వచ్చి గోదాం ముందు లైన్ కట్టిన యూరియా దొరకని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు చెపుతున్నారని, కానీ గ్రామాల్లో యూరియా కోసం పడి కాపులు కాస్తున్నామని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అధికారులు అందించడం లేదని, యూరియా పక్కదారి పడుతున్నట్లు అనుమానం ఉందని రైతులు వాపోతున్నారు.
- Advertisement -